ఓలా.. ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ప్రధానంగా వినిపిస్తున్న బ్రాండ్ పేరు ఇది. క్యాబ్ సేవలను అందించే సమయంలో ఈ బ్రాండ్ పేరు అంతగా వినిపించిందో లేదో తెలియదు కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ తర్వాత దేశంలో ఈ బ్రాండ్ పేరు మారు మ్రోగిపోతోంది. వినూత్న తరహాలో ఎలాంటి భౌతిక డీలర్‌షిప్ కేంద్రాలు కూడా లేకుండా కేవలం ఆన్‌లైన్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారం చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్.. ఇక ఇప్పుడు తమ స్కూటర్ల కొనుగోలు కోసం తదుపరి షెడ్యూల్ ని కూడా ప్రకటించింది.ఈ వారాంతంలో (వీకెండ్‌లో) ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం నెక్స్ట్ పర్చేస్ విండో ఓపెన్ చేస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.గతంలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిజర్వ్ చేసుకున్న కస్టమర్లకు ముందస్తు యాక్సెస్ కూడా లభిస్తుందని అగర్వాల్ తన సోషల్ మీడియా ద్వారా  పేర్కొన్నారు. మే 19, 2022 వ తేదీ నుండి దేశంలోని మరో ఐదు నగరాల్లో కూడా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ రైడ్ క్యాంప్‌లను ప్రారంభించనున్నట్లు ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.ఇక నిజానికి, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయాలన్నా లేదా వాటి డెలివరీ పొందాలన్నా కూడా ఇప్పుడు ఓ పెద్ద ప్రక్రియ అనే చెప్పాలి. 


ఈ స్కూటర్లను కొనే కస్టమర్లు ముందుగా 499 రూపాయాలు చెల్లించి తమకు నచ్చిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంత కాలానికి రూ.20,000 బుకింగ్ అడ్వాన్స్ కూడా చెల్లించి బుక్ చేసుకోవాలి. ఇక ఆ తర్వాత మరికొంత కాలానికి కంపెనీ పేర్కొన్న సమయం ప్రకారం, మిగిలిన బ్యాలెన్స్ ని కూడా చెల్లించి డెలివరీ కోసం వెయిట్ చేయాలి. లభ్యతను ఇంకా అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ను బట్టి,ఇక కంపెనీ కస్టమర్ ఇంటికి నేరుగా స్కూటర్ ను తెచ్చి డెలివరీ చేస్తుంది.ఓలా ఎలక్ట్రిక్ నిజానికి తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ఇంకా డెలివరీ సేవలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఆన్‌లైన్ విధానాన్ని ఫాలో అవుతుంది. ఇక ఒకరకంగా ఇది సక్సెస్ అయినప్పటికీ, కస్టమర్లు మాత్రం ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ కారణంగా చాలా నిరాశకు గురవుతున్నారు. ప్రస్తుతం, ఈ బ్రాండ్ కస్టమర్ల నుండి మిశ్రమ స్పందన బాగా పొందుతోంది.ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల పనితీరుతో కొందరు సంతృప్తిగా ఉంటే, మరికొంత మంది అసంతృప్తితో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: