సాధారణంగా చాలామంది టీ తాగేటప్పుడు సాధారణంగా లేదా అందులోకి కొన్ని యాలకలు వేసి ఉడికించిన టిని తాగుతూ ఉంటారు. అయితే ఇలా యాలకులు టీలో వేసుకొని తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. టీ తాగడం వల్ల మన  శరీరంలో జరిగే మార్పులు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


ముఖ్యంగా యాలకల టీ తాగడం వల్ల జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తి పెంచడానికి  సహాయపడుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, అజీర్తి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ టీ దివ్యఔషధంగా పనిచేస్తుంది.


యాలుకల టి క్రమం తప్పకుండా తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయినటువంటి విష పదార్థాలను కూడా తొలగించడానికి సహాయపడుతుంది. దీనివల్ల ఎటువంటి ఖర్చు లేకుండానే బరువు తగ్గుతారు.


యాలకలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి బలోపేతం చేస్తుంది. దీర్ఘం కాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి కూడా చాలా సహాయపడుతుంది.



యాలుకల టీ నుంచి వచ్చే సువాసన వల్ల  ఒత్తిడి తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఈ టీ తాగడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఇది రక్తంలో ఉండే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది.


యాలకలలో ఉండేటువంటి యాంటీ ఇంప్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను నియంత్రించడానికి  సహాయపడుతుంది


యాలకలలో ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటాయి.దీని ద్వారా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న వారు వీటిని నమలడం వల్ల దుర్వాసన రాకుండా చేస్తాయి.

యాలకలు అప్పుడప్పుడు నమలడం వల్ల శ్వాసతో ఇబ్బంది పడే వారికి, నోటిలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది.


సినాన్ అనే పదార్థం యాలకలలో ఉండడం వల్ల ఇతర ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వంటి వాటిని ఉత్పత్తి కాకుండా పోరాడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: