ఇండియన్ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ గత సంవత్సరం ఇండియన్ మార్కెట్లో తన 'టాటా ఏస్ ఈవీ'  కమర్షియల్ వెహికల్స్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.ఇక కంపెనీ విడుదల చేసిన ఈ అప్డేటెడ్ Ace EV వాహనాల ధర రూ. 9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).  టాటా మోటార్స్ ఫస్ట్ టైం 2005 లో ఏస్ ని ప్రవేశపెట్టింది. చిన్న తరహా వ్యాపారస్థులు ఇంకా అలాగే రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకోచ్చింది. ఇది  తప్పకుండా వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.టాటా ఏస్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ కంపెనీ  ఇవోజెన్ ఈవీ (Evogen EV) పవర్‌ట్రెయిన్ ద్వారా పవర్ ని పొందుతుంది. ఈ పవర్‌ట్రైన్ సెటప్‌లో సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఉంటుంది.ఇది మాక్సిమం 36.2 బిహెచ్‌పి పవర్ ఇంకా 130 ఎన్ఎమ్ మాక్సిమం టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ ట్రక్కులో అమర్చిన లిక్విడ్-కూల్డ్ IP67 సర్టిఫైడ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ తో వర్క్ చేస్తుంది.ఇక టాటా కంపెనీ అందించిన ఈ బ్యాటరీ ప్యాక్ ఒక ఫుల్ చార్జ్ పై మాక్సిమం 154 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.


అయితే ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. టాటా మోటార్స్ ఈ లేటెస్ట్ టాటా ఏస్ ఎలక్ట్రిక్ వాహనాలను అమెజాన్ (Amazon), బిగ్‌బాస్కెట్ (BigBasket), సిటీ లింక్ (City Link), డాట్ (DOT), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), లెట్స్ ట్రాన్స్‌పోర్ట్ (Lets Transport), మూవింగ్ (MoEVing) ఇంకా యెల్లో ఈవీ (Yelo EV) వంటి కంపెనీ లకు ఫస్ట్ డెలివరీ చేస్తుంది.అందువల్ల ఇ-కామర్స్ దిగ్గజాలు ఈ వాహనాలను వినియోగించనున్నాయి.ఈ కొత్త టాటా ఏస్ ఈవీ 3,800 మిమీ పొడవును, 1,500 మిమీ వెడల్పును ఇంకా అలాగే 2,635 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. టాటా ఏస్ ఈవీ  వీల్‌బేస్ 2,100 మిమీగా ఉంటుంది. అలాగే దీని టర్నింగ్ రేడియస్ 4.3 మీటర్లుగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కమర్షియల్ వెహికల్ మొత్తం బరువు 1,840 కేజీలు ఉంటుంది.ఇంకా అలాగే ఇది మొత్తం 600 కేజీల దాకా పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని టాటా కంపెనీ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: