ఈనాటి పంచాంగం
స్వస్తి శ్రీ ప్లవ నామ సంవత్సర ఉత్తరఆయణం గ్రీష్మ ఋతువు
జ్యేష్టమాసము
తిథి: . ద్వాదశి రా1.02
నక్షత్రం : కృత్తిక మ3.21
యోగం: శూల మ2.37
కరణం: కౌలువ ఉ11.47 రైతుల రా1.02
వర్ణం లేదు.
దుర్ముహర్తం: ఉ8.27-9.19కు తిరిగి రా11,15-11.59కు
అమృతకాలం: మ.12.38-2.26కు
సూర్యోదయం : 5.47
సూర్యాస్తమయం : 6.55
మేష రాశి
ముఖ్యమైన విషయాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరమైన అంశాల్లో సానుకూలత. వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలున్నాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృషభ రాశి
అన్ని విషయాలలో కూడా అనుకోని సంఘటనలు. గందరగోళ వాతావరణం. ముఖ్యమైన పనులలో జాప్యం. ప్రయాణాల్లో కూడా వ్యయ ప్రయాసలు. ఆర్థికంగా అనుకోని ఖర్చులు. ఆరోగ్య విషయం లో జాగ్రత్త అవసరం.
మిధున రాశి
ఆర్థికంగా ప్రగతి. విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉన్నత వర్గాల వారితో పరిచయాలు. గృహనిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.
కర్కాటక రాశి
అన్ని విషయాలలో అనుకూల వాతావరణం. వృత్తి ఉద్యోగాల్లో కావాల్సిన సహకారం లభిస్తుంది. అన్ని విషయాలు లాభసాటిగా ముగుస్తాయి. చేపట్టిన పనులలో కార్యజయము. ఆర్థిక పరమైన అంశాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి.
సింహ రాశి
వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైన సమస్యలు. కొత్త రుణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు అవకాశాలు చేజారుతాయి.
కన్య రాశి
అన్నివిషయాల్లో తొందరపాటు వద్దు నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. సహనం పాటించే సందర్భాలే ఎక్కువ. వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప అనుకూలత. ఆర్థికంగా స్వల్ప లాభం. కంటి సమస్యలు బాధిస్తాయి.
తుల రాశి
వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం. గొప్ప వారి వద్ద నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఊహించని కొన్ని మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. శత్రువులుగా ఉన్న వారు మీ పట్ల వారి దృక్పథాన్ని మార్చుకుంటారు. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.
వృశ్చిక రాశి
| ఆర్థిక పరమైన పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పని భారం తగ్గుతుంది. బంధు మిత్రుల కలయిక. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. నిరుద్యోగులకు ఆకాశాలు దొరుకుతాయి.
ధనస్సు రాశి
వృత్తి ఉద్యోగాల్లో మిశ్రమ వాతావరణం. పనిభారం. | ఆర్థికపరమైన విషయాల్లో స్వల్ప అనుకూలత. శత్రువుల నుండి ఇబ్బందులు. కొన్ని ఆశక్తి కరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
మకర రాశి
వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఆర్థికపరమైన అంశాలు కలిసిరావు. చాలా వరకు నిర్ణయాలు వాయిదా పడతాయి. కొందరి ప్రవర్తన బాధకలిగిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు.
కుంభ రాశి
బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయం లో పురోగతి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం. ఆర్థికంగా ప్రగతి.
మీన రాశి
అన్నిట ప్రతికూల వాతావరణం. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం. ఆర్థికంగా రావాల్సిన ధనం సమయానికి చేతికి అందదు. వ్యాపారంలో అనుకోని నష్టాలు. కుటుంసభ్యులతో | వివాదాలు. కోర్టు వ్యవహారాలు వాయిదా .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి