దేశంలో ఎక్కువ సేల్స్ కలిగిన మారుతి సుజుకి నుండి సరికొత్త ఆల్టో సి.ఎన్.జి వెహికల్ లాంచ్ అయ్యింది. ఈ వెహికల్ పెట్రోల్ మోడల్ కన్నా 60000 రూపాయల ఎక్కువ ధరతో వస్తుంది. బిఎస్ 6 నామ్స్ ప్రకారం ఈ వెహికల్ లాంచ్ చేయబడింది. మారుతి సుజుకి మిడ్ స్పెక్ LXi, LXi (O) 4.11 లక్షల ఎక్స్ షోరూం ప్రైజ్ తో వస్తుంది. 


బిఎస్ 4 వెహికల్ అయితే 796cc కెపాసిటీ ఇంజిన్, 41 bhp, 60 nm టార్క్ పవర్ తో వస్తుంది. అయితే ఇంకా సి.ఎన్.జి వెహికల్ యొక్క టెక్నికల్ అప్డేట్స్ బయటకు రాలేదు. ఇక బాడీ, మిగతా పార్ట్స్ విషయంలో పెట్రోల్ వెహికల్ కు.. సి.ఎన్.జి వెహికల్ కు పెద్దగా తేడాలు ఉండవని తెలుస్తుంది.      


పవర్ స్టీరింగ్, ఏసి, ఫ్రంట్ పవర్ విండోస్, సిల్వర్ ఇంటీరియర్ అసెంట్స్, రేర్ సీట్ బెల్ట్, రేర్ చైల్డ్ లాక్, రిమోట్ బూట్ ఫ్యుయల్ లిడ్ ఓపెనర్ అన్ని అందుబాటులో ఉంటాయి. మారుతి సుజుకి ఆల్టో సి.ఎన్.జి వెహికల్ LXi (O)లో మాత్రం ఎయిర్ బ్యాగ్ ఒక్కటి అదనంగా వస్తుంది. ఇక త్వరలో ఆల్టో నుండి K10 వెహికల్ రిలీజ్ కాబోతుంది. అడిషనల్ మ్యాండేటరీ సేఫ్టీ కిట్ తో ఈ వెహికల్ వస్తుంది. ఈ ఇయర్ అక్టోబర్ లో అది రిలీజ్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: