మహీంద్రా.. ఈ సంస్ద నుండి ఏ కారు బయటకు వచ్చిన అదిరిపోవాల్సిందే.. ఎందుకంటే ఆ కారు అందం.. అలాంటిది.. దాని స్టామినా అలాంటిది. అయితే ఈ నేపథ్యంలోనే 2020 ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా ఫన్‌స్టర్ కాన్సెప్ట్ ను తీసుకొచ్చింది. ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ ను తీసుకొచ్చి అందరిని ఆకట్టుకునే ఈ మహీంద్రా సంస్ద ఇప్పుడు మరో అద్భుతమైన కాన్సెప్ట్ తెచ్చి అందరిని ఆకట్టుకుంది. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే.. 

 

మహీంద్రా ఫన్‌స్టర్ కాన్సెప్ట్ రాడికల్ డిజైన్ తో అద్భుతంగా ఉంది. అయితేఈ మహీంద్రా ఫన్‌స్టర్‌ కాన్సెప్ట్‌లో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు 309 bhp ని ఉత్పత్తి చేసే 59.1 kwh పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారు ఉంది. అయితే ఈ కారు 5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోగలదు. 

 

కాగా మహీంద్రా ఈ ఎలక్ట్రిక్ కారుకి ఒకసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 520 కిలో మీటర్ల దూరం వెళ్లే సామర్త్యాన్ని ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ కే ఉంది. 2020 ఆటో ఎక్స్‌పోలో ఫన్‌స్టర్ కాన్సెప్ట్ ఎలెక్ట్రిక్ వాహనాన్ని విడుదల చెయ్యనున్నారు. అయితే ఈ కారు ధర రూ. 8.25 లక్షల వరుకు ఉండనుంది. మరి ఈ కారు వాహనదారులను ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: