మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సూపర్ స్టార్ మోహన్ లాల్ వాహన ప్రియుడు అని మీకు ఎవరికైనా తెలుసా? అవును అయన వాహన ప్రియుడు అందుకే మార్కెట్ లోకి వచ్చిన కొత్త కార్లను అయన కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే అయన మరో వాహనాన్ని కొనుగోలు చేశారు. 

 

ఈ మధ్యే భారత మార్కెట్లో లాంచ్ అయిన టొయోటా వెల్ఫైర్ ఎంపీవీని మోహన్ లాల్ కొన్నారు.. అయితే ఇక్కడే ఓ ప్రత్యేకత ఉంది.. అది ఏంటి అంటే? కేరళలో ఈ వాహనాన్ని కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి ఈయనే.. దీంతో మోహన్ లాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుపురంగు టొయోటా వెల్ఫైర్ కారును మోహన్ లాల్ కొనుగోలు చేశారు. 

 

ఈ వాహనం ప్రారంభ ధర రూ. 79.5 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. మెర్సిడెజ్ బెంజ్ వీ-క్లాస్ కు పోటీగా ఈ కారు విడుదలై వాహనదారులను ఆకట్టుకుంటుంది. ఈ వాహనం భద్రతకు బ్రాండ్ అంబాసిడర్.. ఏదైనా ప్రమాదం ఉంది అంటే హెచ్చరించేందుకు బెల్స్, విజిల్స్ ఉన్నాయి. అంతేకాదు ఈ కారులో ఏడు ఏయిర్ బ్యాగులు, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్లు, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రత ఫీచర్లతో వాహన ప్రియులను ఆకట్టుకుంటుంది ఈ వాహనం.  

మరింత సమాచారం తెలుసుకోండి: