ఈ మధ్యకాలంలో ఏం కొనాలన్నా షాప్ కి వెళ్ళడం లేదు  ఎవరు... ఆన్లైన్లో కొనుగోలు చేయటానికి  ఎక్కువగా  మొగ్గు చూపుతున్నారు.  అత్యవసర సరుకులు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఆన్లైన్ లోనే కొంటున్నారు. ఎందుకంటే షాప్ కి వెళ్ళాలి అంటే ఎంతో శ్రమించాలి...  అదే ఆన్లైన్లో బుక్ చేస్తే ఏదైనా ఇంటి ముంగిటికి రావాల్సిందే. కాలు బయట పెట్టకుండానే ఎలాంటి శ్రమ లేకుండానే కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్  కొనసాగుతున్న సమయంలో కాలు బయటపెట్టలేని   పరిస్థితి. ఇలాంటి సమయంలో ఎవరైనా కారు కొనాలంటే ఎలా  అనుకుంటూ ఉంటారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఆటోమొబైల్ దిగ్గజాలు నేరుగా ప్రజల వద్దకే సేవలను తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి. 

 

 

 దానిలో భాగంగానే క్లిక్ టూ  డ్రైవ్ పేరుతో ఆటోమొబైల్ కంపెనీ అయిన టాటా మోటార్స్ ఆన్లైన్లో కార్లు కొనుగోలు చేసుకునే సౌలభ్యాన్ని ప్రస్తుతం ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. దేశంలో కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని కంపెనీల కార్యకలాపాలు నిలిచిపోయిన  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ వినూత్న  సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు  ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్  ముందడుగు వేస్తున్నాయి. క్లిక్ టూ  డ్రైవ్ లో ప దేశవ్యాప్తంగా ఉన్న 750 అవుట్ లెట్లను  టాటా కంపెనీ ఓకే గూటికి  తీసుకొచ్చింది. ప్రస్తుతం లాక్  డౌన్ లో ఎవరైనా కార్ కొనాలనుకుంటే క్లిక్ టూ  డ్రైవ్ వెబ్సైట్లోకి వెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. ప్యాసింజర్ వెహికల్స్ పోర్ట్ఫోలియో ద్వారా మీకు నచ్చిన కారు ను  ఎంచుకోవాల్సి ఉంటుంది. వీడియో బ్రోచర్ కూడా అందుబాటులో ఉంటుంది.

 

 

 ఇక మొత్తం కారు కొనుగోలు వ్యవహారమంతా ఈ మెయిల్స్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారానే పూర్తి పూర్తి చేసుకోగలిగేలా టాటా మోటార్స్ ఓ ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. కంపెనీ లేటెస్ట్ కార్ ఆల్టోజ్  ను వర్చువల్ షోరూమ్ ద్వారా సొంతం చేసుకోవచ్చు అంటూ తెలిపింది. అయితే ప్రస్తుతం కరోనా  వైరస్ దేశం మొత్తాన్ని కలవరపెడుతున్న వేల కొత్త మోడల్స్ ని పరిచయం చేసేందుకు ఇంటర్నేషనల్ ఆటో షో లు దాదాపు నిలిచిపోయాయి. దీంతో తమ తమ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడానికి డిజిటల్ ప్లాట్ ఫారం లను  ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఆటోమొబైల్ కంపెనీలు. ఏదేమైనా ఈ కొత్త ఐడియా మాత్రం అదిరిపోయింది గురు అంటున్నారు వినియోగదారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: