ఇండియాలో చాలా రకాల కంపెనీ కార్లు అందుబాటులో ఉన్నాయి.. వాటి గురించి కొంతమందికి తెలియదు.. కానీ కారు కొనాలనే కోరికతో ఉంటారు.. అలాంటి వాళ్ళు ముఖ్యంగా కారు గురించి లేదా ఏ కంపెనీ కారు మనకు సరిపోతుంది అనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది అని అంటున్నారు. మరి ఇండియాలో బెస్ట్ కార్లు ఎంటో ఇప్పుడు చూద్దాం. స్టైల్ తో పాటుగా అదిరిపోయే ఫీచర్స్ మరియు ఆకట్టుకునే మైలేజ్, ధరలతో భారత మార్కెట్ లో చాలా కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్ కార్లు ఎంటో చూడండి..


మారుతీ సుజుకీ సియాజ్..

మారుతి కంపెనీలో ఈ కారుకు చాలా ప్రత్యేకత ఉంది.ఈ కారు ధర వచ్చేసి రూ.8.31 లక్షల నుంచి రూ.11.09 లక్షల మధ్య ఉంది. ఇది లీటరుకు గరిష్ఠంగా 20 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుంది. ఇటీవలే బీఎస్6 ఫార్మాట్లో మారుతీ సుజుకీ సియాజ్ పెట్రోల్ ఇంజిన్ వాహనాన్ని భారత విపణిలోకి విడుదల చేసింది.. ఈ కారు అధిక మైలేజ్ ఇవ్వడంతో పాటుగా ధర కూడా అందుబాటులో ఉండటంతో ఈ కారును కొనే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది..


టాటా టైగర్..


టాటా కంపెనీ తయారు చేసిన కార్లలో ఈ కారు కూడా చాలా ప్రత్యేకమైంది.. ధర తో పాటుగా అధిక మైలేజ్ ను కూడా అందిస్తుంది..5.75 లక్షల నుంచి 7.49 లక్షల మధ్య ఉంది. లీటరుకుగరిష్ఠంగా 20.3 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుందీ వాహనం. ఇటీవలే ఈ వాహనాన్ని బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసింది టాటా సంస్థ. టియాగో హ్యాచ్ బ్యాక్ ల్లో సెడాన్ వర్షన్ ఈ టాటా టైగర్ మోడల్. ఆరు వేరియంట్లలో లభ్యమవుతుంది.


మారుతీ సుజుకీ డిజైర్..

మారుతీ సుజుకీ డిజైర్. ఈ కారు ధర వచ్చేసి రూ.5.89 లక్షల నుంచి రూ.8.81 లక్షల మధ్య ఉంది. మైలేజి దగ్గరకొస్తే లీటరుకు గరిష్ఠంగా 23.26 కిలోమీటర్ల నుంచి 24.12 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. ఈ సరికొత్త మారుతీ సుజుకీ డిజైర్ వాహనంలో తర్వాతి తరం కే-సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వీవీటీబీఎస్6 ఇంజిన్ ను పొందుపరిచారు... అధ్బుతమైన ఫీచర్స్ తో ఈ కారు చూపరుల దృష్టిని ఆకర్షిస్తుంది.. దాంతో కారును కొనే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది.. ఈ కార్లన్నీ కూడా టాప్ మైలేజ్ ఇచ్చే కార్లే..

మరింత సమాచారం తెలుసుకోండి: