ప్రముఖ దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్ ప్రజల ఇష్టానికి తగ్గట్లు కొత్త కార్లను మార్కెట్ లోకి వదులుతున్నారు. ఈ నెలలో ఎన్నో కార్లను అదిరిపోయే ఫీచర్లతో వదులుతున్నారు. ధర కూడా కేవలం ప్రజలకు అందుబాటు లో ఉంటుంది.తాజాగా తన టాటా టియాగో మోడల్లో సరికొత్త వేరియంట్ ను భారత విపణిలో లాంచ్ అయింది. అదే టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ వచ్చింది. ఎక్స్ షోరూంలో టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ ప్రారంభ ధర వచ్చేసి రూ.5.79 లక్షలు. ఈ హ్యాచ్ బ్యాక్ మిడ్ స్పెక్ ఎక్స్ టీ వేరియంట్లో సరికొత్త ఫీచర్లను పొందుపరిచారు.. గతంలో వచ్చినదాని కంటే ఇప్పుడు వచ్చినది అందరికీ నచ్చుతుందట..


టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ ఎక్స్ టీరియర్ దగ్గరకొస్తే 14-అంగుళాల అల్లాయ్ వీల్స్ తో పాటు బోల్డ్ బ్లాక్ కలర్ తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా సరికొత్తగా మూడు పెయింట్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇకపోతే రెండు పెయింట్ ఆఫ్షన్ లలో ఉంది.అదే ఫ్లేమ్ బెడ్, పెరల్సెంట్ వైట్, డేటోనా గ్రే లాంటి రంగుల్లో ఇది లభ్యమవుతుంది. ఇవి కాకుండా ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్లో 5-అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిస్టం, 3డీ నేవిగేషన్ నవీ మ్యాప్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ అండ్ డిస్ ప్లే, వాయిస్ కమాండ్స్, ఇమేజ్ వీడియో ప్లే బ్యాక్ లాంటి ఆప్షన్లు ఇందులో ఉన్నాయి.


ఇకపోతే ఈ కారు ప్రత్యేకతలు విషయానికొస్తే.. టియాగో హ్యాచ్ బ్యాక్ వచ్చేసి 1.2-లీటర్ మూడు సిలీండర్ల పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 84 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 5-స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ వ్యవస్థతో పనిచేస్తుది. స్టాండర్డ్ టియాగో ఎక్స్ టీ వేరియంట్ ఏఎంటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. భారత మార్కెట్లో ఈ కారుకు పోటీగా మారుతీ సుజుకీ స్విఫ్ట్, ఫోర్డ్ ఫీగో, హ్యూండాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ లాంటి వాహనాలు ఉన్నాయి.. ఈ కారు విడుదల అయిన నాటి నుంచే పోటీ మొదలైంది. అందుకే అంటారు టాటా ఇండియా నెంబర్ వన్ కంపెనీ అని.. ఉగాదికి మరో ఎడిషన్ కారును మార్కెట్లోకి విడుదల చేస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: