ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు కొత్త కార్లను, కొత్త వాహనాలను తయారీ చేస్తూవస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల మోడల్స్ కార్లు ఈ కంపెనీ నుంచి వచ్చినవే కావడం విశేషం. యువత ఆలోచనలకు తగ్గట్లు కొత్త ఫీచర్లతో వాహనాలను తయారు చేస్తూ ప్రజల మన్ననలను అందుకుంటున్నది టాటా మోటార్స్. ఇటీవల మార్కెట్ లోకి విడుదలైన కొత్త కార్లు భారీ సేల్స్ ను అందుకున్నాయి. దీంతో ఇప్పుడు మరో కొత్త రకం కారును తయారు చేస్తుంది.


ఆ కారు గతంలో  ఎప్పుడు చూడని విధంగా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కారు ప్రత్యేకత గాలితో నడవడం. అవును మీరు విన్నది నిజమే.. ఎయిర్ కారు దాని పేరు.. ఇక ఆలస్యం ఎందుకు ఒకసారి ఆ కారు స్పెషల్ ఫీచర్స్ ఏంటో చూసేద్దాం.. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు, గాలి ద్వారా వాహనాన్ని నడిపే పరిజ్ఞానాన్ని అభివృద్ది చేస్తున్న టాటా త్వరలో అమ్మకాలకు విడుదల చేయడానికి సిద్దం అవుతోంది.


పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్‌ల ద్వారా జరిగే పర్యావరణ వినాశనానికి మరియు ఎలక్ట్రిక్ కార్లలో పవర్ కొరత, గ్యాస్ తో నడిచే కార్లతో  ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. వీటిని అధిగమించడం లో ఈ కారు  గ్రేట్ అనే చెప్పాలి. ఈ కారు లో ముగ్గురు మాత్రమే కూర్చోగలరు. ఇంధనం మరియు విద్యుత్ వినియోగంతో నడిచే కన్వెన్షనల్ కార్ల కన్నా గాలితో నడిచే కారు బరువు తక్కువగా ఉంటుంది. ఈ కారులో ఒకసారి గాలిని నింపితే దాదాపు 200 కిలో మీటర్లు ప్రయాణం చేయవచ్చు. రెండు నిమిషాల్లోనే కారు ట్యాంక్ లో గాలిని నింపవచ్చు. 70 రూపాయల ఖర్చును  వెచ్చించాలి. అంటే కేవలం 70 రూపాయలతో  200 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.. చూసారుగా ఎన్ని అద్భుతాలు ఈ కారు వల్ల ఉన్నాయో.. ఇది కనుక మార్కెట్ లోకి  వస్తే అద్భుతాన్ని సృష్టిస్తుంది. మరి ఈ కారు ఎప్పుడు మార్కెట్ లోకి  వస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: