ఇక మీరు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరు ఎక్కడికీ వెళ్లకుండానే ఇంట్లో నుంచే మీరు అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్ (EV) ని కొనుగోలు చేయొచ్చు.అది ఎలా అంటే ఇక మీరు ఈ డీల్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రముఖ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన ఫ్లిప్‌కార్ట్‌లో  చౌక ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్ ని అందుబాటులో ఉంది. రాయల్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ సామాన్యులకు అందుబాటు ధరకే లభిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మీరు కేవలం రూ. 36,240కే సులభంగా కొనుగోలు చేయొచ్చు. ఇంకా అంతేకాకుండా దీన్ని కొనుగోలు చేసేందుకు ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ క్రెడిట్ కార్డు వంటి వాటి ద్వారా మీరు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని కనుక కొనుగోలు చేస్తే.. ఏకంగా రూ. 1500 వరకు తగ్గింపు వస్తుంది. అంటే అప్పుడు మీకు రూ. 35 వేల కన్నా తక్కువకే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మీ వద్దకు వచ్చినట్లు అవుతుంది.ఇక దీన్ని మీరు ఒక్కసారి చార్జ్ చేస్తే ఇది ఏకంగా 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. కంపెనీ దీనిలో ఎల్ఈడీ యాసిడ్ అంట్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీని అమర్చింది.


ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే.. గంటకు 35 కిలోమీటర్లు. దీని లోడ్ కెపాసిటీ 150 కేజీలు. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ట్యూబ్‌లెస్ టైర్లను కూడా అమర్చింది. ఇంకా అంతేకాకుండా దీనికి రివర్స్ గేర్ కూడా ఉంది.ఇక రాయల్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వారంటీ కూడా మీకు లభిస్తోంది. బ్యాటరీపై మూడేళ్ల దాకా వారంటీ ఉంది. అలాగే మోటార్‌పై కూడా మీకు మూడేళ్ల వారంటీ వస్తుంది. చౌక ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేసే వారు ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. ఇంకా మీకు మార్కెట్‌లో ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. కాగా ప్రస్తుతం మార్కెట్‌లో ఓలా, ఏథర్, హీరో ఎలక్ట్రిక్, బజాజ్ చేతక్ వంటి పలు రకాల కంపెనీలు మార్కెట్‌లో చాలా ఎలక్ట్రిక్ మోడళ్లను అందిస్తున్నాయి. మీరు వీటిల్లో కూడా మీకు నచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను చూజ్ చేసుకోవచ్చు.కానీ వీటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: