మన ఇండియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ 'హోండా ఇండియా'  త్వరలోనే ' ఎలివేట్ ' (Elevate) ఎస్‌యువిని విడుదల చేయడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు ఈ కార్ల బుకింగ్స్ గురించి అధికారిక సమాచారంని వెల్లడించింది.ఇక హోండా ఎలివేట్ బుకింగ్స్ 2023 జులై 03 నుంచి స్టార్ట్ అవుతాయి. రూ. 21,000 చెల్లించి మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ మిడ్ సైజ్ ఎస్‌యువి ధరలు ఆగస్ట్ నెల చివరిలో లేదా సెప్టెంబర్ నెల ప్రారంభంలో ప్రకటించే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అంటే అప్పటికి ఈ కారు ఇండియన్ మార్కెట్లో అధికారికంగా విడుదలవుతుంది. ఇంకా అంతే కాకుండా ఈ నెల చివరి నాటికి డిస్‌ప్లే ఇంకా ఆగష్టు చివరి నాటికి టెస్ట్ డ్రైవ్‌లు కూడా స్టార్ట్ అవుతాయి.ఇంకా ఈ హోండా ఎలివేట్ మొత్తం నాలుగు ట్రిమ్లలో విడుదలయ్యే అవకాశం ఉందని డీలర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఖచ్చితమైన వివరాలు మాత్రం లాంచ్ నాటికి తెలుస్తాయి.ఎలివేట్ ఎస్‌యువి 1.5-లీటర్, ఫోర్ సిలిండర్ ఇంకా న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 121 హార్స్ పవర్ అలాగే 145 ఎన్ఎమ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది.దీని ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ సివిటీ గేర్‌బాక్స్‌ ని పొందనుంది.పవర్‌ట్రెయిన్ మాత్రం హోండా సిస్టయి లాగా ఉంటుందని భావిస్తున్నారు.


దీని డిజైన్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది విశాలమైన ఫ్రంట్ గ్రిల్, మధ్యలో బ్రాండ్ లోగో, హెడ్ లైట్, ఫాగ్ లైట్స్, వంటివి ఈ కార్ లో గమనించవచ్చు. ఈ ఎస్‌యువి 4312 మిమీ పొడవు, 1790 మిమీ వెడల్పు, 1650 మిమీ ఎత్తు ఇంకా 2650 మిమీ వీల్‌బేస్ కలిగి 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ పొందుతుంది. అందువల్ల సైజ్ పరంగా ఇది చాలా  స్ట్రాంగ్ గా ఉంటుంది.హోండా ఎలివేట్ సాఫ్ట్ టచ్ ప్యానెల్స్ ఇంకా విశాలమైన సీటింగ్‌తో క్యాబిన్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది.అలాగే 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, 7 ఇంచెస్ సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, లేన్-వాచ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్‌ప్లే, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్‌తో కూడిన ADAS వంటి అప్డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఇది సింగిల్-పేన్ సన్‌రూఫ్‌ను మాత్రమే పొందుతుంది.ఇక ఈ కొత్త హోండా ఎలివేట్ ఇండియన్ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మొదలైన కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. దీని ధర రూ. 12 లక్షల ధర వద్ద స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: