స‌హ‌జంగా మ‌హిళ‌లు అందానికి ఎక్కువ‌గా ప్రాముఖ్యత‌ ఎక్కువ ఇస్తుంటారు. ముఖంలో ఏ చిన్న స‌మ‌స్య ఉన్న క‌ల‌వ‌ర‌ప‌డుతుంటారు. అయితే చాలా మంది ఆడ‌వాళ్లో సాధార‌ణంగా ఉండే స‌మ‌స్య అవాంచిత రోమాలు. వీటి వల్ల ముఖం అందవికారంగా కనిపించటమే గాక మహిళలు మానసికంగా కుంగిపోతారు. ముఖంపై వ‌చ్చే రోమాల‌ను తొల‌గించుకోవ‌డానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ, డబ్బు ఖర్చు చేస్తూ, తాత్కాలిక ఉపశమనం మాత్రమే పొందుతారు. 


ముఖ్యంగా పైపెదవి మీద‌ వెంట్రుకలు మ‌హిళ‌ల‌ను బాగా ఇబ్బంది పెడ‌తాయి. జెన్స్‌కు అయితే ఎలాంటి స‌మ‌స్య లేక‌పోయినా ఆడ‌వాళ్ల‌కు మాత్రం అదే పెద్ద స‌మ‌స్య‌. ఇలాంటి సమస్యలతో బాధ‌పడే ఆడ‌వారు శాశ్వ‌తంగా ముఖంపై రోమాల‌ను తొల‌గించుకోవ‌డానికి ఈ చిట్కాల‌ను ట్రై చేయండి..


- ఎగ్ వైట్‌లో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్‌ కలిపి ముఖానికి రాసి ఆరనిచ్చి నీటితో కడిగితే ముఖంపై అవాంచిత రోమాలు సులభంగా తొలగిపోతాయి.


- చక్కెర‌లో కొంచెం నిమ్మ ర‌సం, తేనె క‌లిపి ముఖానికి రాయాలి. డ్రై అయ్యాక వ్యాక్స్ తొల‌గించిన‌ట్టుగానే ఒక క్లాత్ సాయంతో ముఖంపై ఉన్న ప్యాక్ తొల‌గించాలి.


- శెన‌గ‌పిండిలో కొద్దిగా నిమ్మ‌రసం మ‌రియు వాట‌ర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉన్న రోమాలు తొల‌గిపోతాయి.


- పాల‌లో కొద్దిగా ప‌సుపును క‌లిపి ముఖానికి రాసుకోవాలి. డ్రై అయ్యాక ముఖాన్ని వాష్ చేసుకోవాలి. ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల అవాంచిత రోమాలను తొలగించడానికి సహాయ‌ప‌డుతుంది.


- బంగాళ‌దుంప ర‌సంలో శెన‌గ‌పిండిని మిక్స్ చేసి ఫేస్‌కు అప్లై చేయాలి. ఈ ప్యాక్ ముఖంపై రోమాల‌ను తొల‌గించ‌డంలో బాగా ఎఫెక్టీవ్‌గా ప‌ని చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: