ప్రతి ఒక్కరూ ముఖ అందం కోసం ఎంత తహతహలాడుతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ముఖం మీద ఎంత శ్రద్ధ వహిస్తారో అంతే శ్రద్ధ అండర్ ఆర్మ్స్ పై కూడా చూపించాలి. అయితే చాలామందికి అండర్ ఆర్మ్స్ నల్లగా మారడం వల్ల స్లీవ్ లెస్ డ్రస్సులు వేసుకోలేక పోతున్నారు.  నలుగురిలో అందంగా తిరగడం కోసం రకరకాల దుస్తులు ధరించడం అందరికీ అలవాటు. అయితే ఈ అలవాటు అండర్ ఆర్మ్స్ నల్లగా మారడం వల్ల ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలను పాటించి అండర్ ఆర్మ్స్ లో ఉండే నలుపు ను తగ్గించుకోవచ్చు.


బంగాళా దుంప, తేనే:
బ్యూటీ కేర్ విషయంలో బంగాళదుంపలు అలాగే తేనె మొదటి పాత్ర వహిస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల తక్కువ సమయంలోనే చంకలో ఉండే నలుపు యిట్టె తగ్గించుకోవచ్చు. ఇందుకోసం బంగాళాదుంప రసంలో కొద్దిగా తేనె కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ అద్ది నల్లగా ఉన్న ప్రదేశంలో రుద్దుతూ మర్దన చేయాలి. తరచూ ఇలా చేయడం వల్ల చంకల్లో ఏర్పడిన నలుపు భాగం తగ్గిపోవడం గమనించవచ్చు.


బంగాళ దుంప, చక్కెర,నిమ్మరసం :
బంగాళదుంప,నిమ్మరసం, చక్కెర ఇవన్నీ కలిపి నల్లగా ఉన్న ప్రదేశం పై స్క్రబ్ లా తిక్కుతూ మర్దన చేయాలి. అయితే చక్కెర చంక భాగంలో ఏర్పడిన నలుపును తగ్గిస్తుంది. నిమ్మరసం, బంగాళదుంపలు కూడా నలుపుదనాన్ని బాగా తగ్గిస్తాయి..


పాలు, బంగాళదుంపలు :
పాలు, బంగాళాదుంపలు అనేక రకాల చర్మ సమస్య లను తగ్గించడానికి సహాయపడుతాయి. బంగాళదుంపలను, పాలతో కలిపినప్పుడు ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. వీటిని సమపాళ్లలో కలిపి చంక భాగంలో పూయాలి. మరియు మూడు నిమిషాల పాటు మసాజ్ చేయండి. చంకల యొక్క ముదురు రంగు కూడా మారుతుంది.  ఇది లోతుగా శుభ్రం చేసి నలుపుదనాన్ని పోగొట్టి, తెల్లని చర్మాన్ని మీ సొంతం అయ్యేలా చేస్తుంది..


ఇవే కాకుండా బంగాళదుంపతో కీర దోసకాయ రసం, అలాగే పెరుగు, కాఫీ పొడి ఇలాంటివి కలిపి చంక భాగంలో రాస్తూ  ఉండటం వల్ల చంకల్లో నలుపు బాగా తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: