ఈ పులిపిరి సమస్య ప్రతి ఒక్కరిలోనూ ఏర్పడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో చోట ఈ పులిపిర్లు ఏర్పడి, చూడడానికి అందవిహీనంగా కనిపించేలా చేస్తాయి. నిజానికి ఈ పులిపిర్లు ఎలా ఏర్పడతాయి అంటే, ఇందుకు కారణం హ్యూమన్ పాపిలోమా అనే వైరస్ వల్ల ఈ పులిపిర్లు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ముక్కు,గడ్డం,మెడ, చేతి వేళ్ళ పైన వస్తూ ఉంటాయి. అయితే ఇవి ఎలాంటి నొప్పిని కలిగించవు. కానీ కొంత మందిలో ఇవి దురద పెడుతూ ఉంటాయి.


ఈ పులిపిర్లలలో రకాలు కూడా ఉంటాయి. చేతివేళ్ళ చుట్టూ వచ్చే పులిపిర్లను కామన్ వార్ట్స్ అంటారు. ముఖం అలాగే మెడ మీద వచ్చే పులిపిర్లను ఫ్లాట్ వార్ట్స్ అంటారు. అయితే మరికొంతమందిలో చాలా అరుదుగా జననాంగాలపై కూడా ఈ పులిపిర్లు ఏర్పడతాయి. వీటిని  జనైటల్ వార్ట్స్ అంటారు. సాధారణంగా మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువైనప్పుడు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినపుడు కొన్ని రకాల వైరస్లు శరీరంపై దాడి చేస్తాయి. ఫలితంగా పులిపిర్లు ఏర్పడతాయి. కొంతమంది ఈ పులిపిర్లను కాల్చడం, కత్తిరించడం వంటివి చేస్తూ ఉంటారు. అలా చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే వీటిని ఇంటి చిట్కాలు పాటించి, తొలగించవచ్చు అని అంటున్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


యాపిల్ సైడర్ వెనిగర్ లో సహజసిద్ధంగా అధిక యాసిడ్ కంటెంట్ ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా పులిపిర్లు పెరగకుండా ఆపేలా చేస్తుంది. ఇందుకోసం ఒక కాటన్ బాల్ తీసుకొని, ఆపిల్ సైడర్ వెనిగర్ లో అద్ది, దానిని పులిపిర్లు ఉన్నచోట రుద్దడం వల్ల తక్కువ సమయంలోనే ఈ పులిపిర్లు తొలగిపోవడం గమనించవచ్చు.

కలబంద లో ఉండే మేలిక్ యాసిడ్ పులిపిర్ల లోని ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఇందుకోసం అలోవెరా జెల్ ను తీసుకొని పులిపిరి ఉన్నచోట రుద్దడం వల్ల త్వరగా తగ్గిపోతాయి.


రాత్రి పడుకునే ముందు  బేకింగ్ పౌడర్ తీసుకొని ఆముదంలో వేసి బాగా కలిపి, దానిని పులిపిర్లు ఉన్న చోట అప్లై చేసి , ఉదయాన్నే  శుభ్రంగా కడిగి వేయాలి. ఇలా చేయడం వల్ల కూడా పులిపిర్లు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: