మీరు సహజమైన చర్మ కాంతి  పొందాలంటే ఎక్కువగా మేకప్ వేసుకోవద్దు. వారంలో కనీసం ఒకరోజు మీ ముఖానికి ఎలాంటి ఫేషియల్ క్రీమ్‌లు ఇంకా సౌందర్య సాధనాలను అప్లై చేయకుండా ఉండండి.మీరు ఇలా  చేయకుండా ఉండటం వల్ల మీ ముఖంలో సహజమైన నిగారింపు వస్తుంది. అయితే బయటకు వెళ్లేటపుడు మాత్రం హానికరమైన సూర్య కిరణాల ప్రభావాల నుండి మీ చర్మాన్ని కాపాడుకోవడం కోసం సన్ స్క్రీన్ లోషన్ ని వాడండి.ఇంకా మీ ముఖాన్ని కడిగేటప్పుడు అస్సలు వేడి నీరు ఉపయోగించవద్దు. ఎందుకంటే వేడి నీటితో కడగడం వల్ల మీ చర్మాన్ని తేమగా ఇంకా మృదువుగా ఉంచే సహజ నూనెలు ఈజీగా తొలగిపోతాయి. అలాగే వేడి నీరు మీ చర్మాన్ని చాలా పొడిగా చేస్తుంది. ఇంకా అలాగే మీ చర్మం సున్నితమైన సమతుల్యతను దెబ్బతీస్తుంది.మంచి సహజమైన ముఖకాంతిని పొందడం కోసం మీరు తీసుకోగల ముఖ్యమైన రోజువారీ చర్య మీ చర్మాన్ని బాగా శుభ్రపరచడం.


ప్రతిరోజూ పడుకునే ముందు ఇంకా ఉదయం పూట నిద్ర లేవగానే, మీ చర్మాన్ని స్వచ్ఛమైన నీటితో బాగా శుభ్రం చేసుకోండి. బయట తిరగడం, వ్యాయామం, ఆటలతో చర్మంపై దుమ్ము, చెమట, మురికి ఇంకా అలాగే సూక్ష్మజీవులు పేరుకుపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ చర్మాన్ని శుభ్రపరచడం చాలా ముఖ్యం.ఖచ్చితంగా సహజమైన రోజ్ వాటర్ ని ఉపయోగించండి.ఇంకా అలాగే శరీరంలో ప్రతి అవయవానికి ఇంకా ప్రతి కణానికి కూడా నీరు అనేది చాలా అవసరం. కాబట్టి ప్రతి రోజూ కూడా తగినంత నీరు తాగడం వలన మొత్తం శరీరానికి వివిధ మార్గాల్లో మంచి ప్రయోజనం అనేది చేకూరుతుంది. ఆ ప్రయోజనాల్లో ఒకటి మెరుగైన చర్మం. మీరు హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల మీ ముఖం విచ్చుకుంటుంది. లేదంటే మీ ముఖం చాలా కళావిహీనంగా కనిపిస్తుంది. అందుకే మీరు ఎప్పుడూ కూడా నీరు ఇంకా ఎలక్ట్రోలైట్స్ కలిగిన స్వచ్ఛమైన కొబ్బరినీరుని తాగుతుండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: