బ్లాక్ హెడ్స్ చాలా కాలం పాటు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇవి ఎక్కువగా ముక్కు, బుగ్గలు, వీపు, నుదురు వంటి భాగాల్లో వస్తూ ఉంటాయి. జిడ్డు చర్మం ఉన్న వారిలో ఈ సమస్య అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. చర్మంపై ఉండే జిడ్డుతో మృతకణాలు, దుమ్ము ఇంకా ధూళి వంటివి చేరి బ్లాక్ హెడ్స్ గా తయారవుతాయి. చాలా మంది కూడా ముఖంపై ఉండే ఈ బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి ప్రభావవంతమైన టిప్ ని తయారు చేసుకుని వాడడం వల్ల మనం చాలా సులభంగా ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ను ఈజీగా తొలగించుకోవచ్చు.ఈ టిప్ తయారు చేసుకోవడం అలాగే వాడడం కూడా చాలా ఈజీ. బ్లాక్ హెడ్స్ ను తొలగించే ఆ టిప్ ఏమిటి..ఇంకా దీనిని ఎలా తయారు చేసుకోవాలి..దాని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. వంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం వైట్ టూత్ పేస్ట్ ను, అర టీ స్పూన్ వంటసోడాను ఇంకా అలాగే అర టీ స్పూన్ కొబ్బరి నూనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక ముందుగా పావు టీ స్పూన్ టూత్ పేస్ట్ ను ఒక గిన్నెలోకి తీసుకోని ఆ తరువాత ఇందులో వంటసోడా, కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ఉపయోగించడానికి ముందుగా ఒక గిన్నెలో వేడి నీటిని తీసుకోవాలి. ఈ నీటిలో దూదిని ముంచి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో ముందుగా బాగా శుభ్రం చేసుకోవాలి.ఆ తరువాత ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని తీసుకుని బ్లాక్ హెడ్స్ పై రాసుకోవాలి. చేతి వేళ్లతో రెండు నుండి మూడు నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆరిన తరువాత వేళ్లతో రుద్దుతూ నీటితో కడిగి బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఈ టిప్ ని వాడడం వల్ల మనం చాలా సులభంగా ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవచ్చు. ఈ టిప్ వాడిన మొదటిసారే బ్లాక్ హెడ్స్ తొలిగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: