ఆసియా గేమ్స్ లో బంగారు పతకం గెలిచిన భారతదేశపు మొట్టమొదటి మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ తన 27వ పుట్టినరోజును ఈరోజు జరుపుకుంటోంది. ఆగస్టు 25, 2021న ఆమె పుట్టినరోజు. ఇలాంటి జాతిరత్నాలు ఎన్నో మన ఇండియా నుంచి రావాలి. వారికి స్ఫూర్తిగా వినేష్ ఫోగట్ నిలవాలి. ఇక నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా వినేష్ ఫోగట్ కు సంబంధించిన కొన్ని విషయాలు.

వినేష్ ఫోగట్ ఆగస్టు 25, 1994 న హర్యానాలోని భివానీ జిల్లాలోని బాలాలి గ్రామంలో రాజ్ పాల్ ఫోగట్ కు జంపించింది. జన్మించింది. వినేష్ ఫోగట్ రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్ మేనకోడలు. ఆమె కజిన్స్ గీతా ఫోగట్, బబితా కుమారి అంతర్జాతీయ రెజ్లర్లు, కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలు కూడా. 2013 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో కాంస్య పతకం గెలిచిన తర్వాత వినేష్ వెలుగులోకి వచ్చింది. అదే సంవత్సరంలో ఆమె కామన్వెల్త్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రజతం కూడా సాధించింది.
 
కామన్‌వెల్త్ గేమ్స్, ఆసియాడ్ రెండింటిలోనూ బంగారు పతకం సాధించిన మొదటి భారతీయ మహిళా రెజ్లర్ ఫోగట్.
ఇటీవల ఆమెకు భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవం అయిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు లభించింది. ఈ అత్యున్నత పురస్కారం పొందిన రెండవ భారతీయ మహిళా రెజ్లర్.
2018 కామన్వెల్త్, ఆసియన్ గేమ్స్‌లో బంగారు పతకాలు, 2019 ఆసియన్, వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు తెచ్చినందుకు ఆమె ఈ అవార్డుకు ఎంపికైంది. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకున్న ఐదుగురు అథ్లెట్లలో వినేష్ ఫోగట్ ఒకరు.
ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్.
కామన్వెల్త్ మరియు గేమ్స్ రెండింటిలోనూ బంగారు పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ కూడా వినేష్ ఫోగట్.
2018 కామన్వెల్త్ గేమ్స్, 2018 ఆసియా గేమ్స్‌లో ఆమె బంగారు పతకాలు సాధించింది.
ఫోగట్ రెండుసార్లు 2014, 2018 కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేత.
ఆమె 2019 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా నిలిచింది.
ఫోగట్ ను ప్రభుత్వం 2016లో అర్జున అవార్డుతో సత్కరించింది.
2020 లో భారతదేశ అత్యున్నత క్రీడా గౌరవం అయిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు.
సాక్షి మాలిక్, ఖేల్ రత్న అందుకున్న రెండవ భారతీయ మహిళా రెజ్లర్ వినేష్.
13 డిసెంబర్ 2018 న ఆమె తన చిరకాల ప్రియుడు, తోటి రెజ్లర్ సోమ్‌వీర్ రతీని వివాహం చేసుకుంది. ఆయన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో రెండుసార్లు బంగారు పతక విజేత.
2019 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
2019 యాసర్ డోగు ఇంటర్నేషనల్ లో ఫోగట్ స్వర్ణం గెలుచుకుంది.
2019 పోలాండ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్ లో వినేష్ ఫోగట్ మహిళల 53 కిలోల విభాగంలో వరుసగా మూడో స్వర్ణం సాధించింది.
2019 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ లో మహిళల 53 కిలోల విభాగంలో వినేష్ ఫోగట్ తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాన్ని సాధించింది. టోక్యో ఒలింపిక్స్ 2020 కి అర్హత సాధించిన తొలి భారతీయ రెజ్లర్‌గా ఆమె మొదటి ఆరు స్థానాల్లో నిలిచింది.
జనవరి 2020 లో, రోగా ర్యాంకింగ్ సిరీస్‌లో లూయిసా ఎలిజబెత్ వాల్వర్డే (4-0) ని ఓడించి ఫోగట్ స్వర్ణం సాధించింది.
2021 అత్యుత్తమ ఉక్రేనియన్ రెజ్లర్స్, కోచ్స్ మెమోరియల్ టోర్నమెంట్ లో బంగారు పతకం సాధించింది.
2021 పోలాండ్ ఓపెన్ రెజ్లింగ్ టోర్నమెంట్
2021 పోలాండ్ ఓపెన్‌లో మహిళల 53 కిలోల ఈవెంట్‌లో వినేష్ ఫోగట్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: