1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఏకపక్షంగా వ్యవహరించి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. నేటితో ఈ ఘటన జరిగి 45 ఏళ్లు అయింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎమర్జెన్సీ సమయంలో 17 నెలలు జైల్లో గడిపారు. వెంకయ్య కలహాల పేరుతో రాత్రికి రాత్రే దేశంలో ఎమర్జెన్సీ విధించారని వాపోయారు. 21 నెలల కాలం ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారని చెప్పారు. 
 
దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో 1977 ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొని తాను జైలు జీవితం గడపాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఆ సమయంలో తాను విద్యార్థిని అని అన్నారు. ఆ సమయంలో తనకు రచయితలు, విపక్ష నేతలు, జర్నలిస్టులను జైలులో పెట్టారని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: