వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సిడబ్ల్యుసి సమావేశంలో 48 మంది CWC సభ్యులు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, అధిర్ రంజన్ చౌదరి, గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, మోతిలాల్ఒరా, ముకుల్ వాస్నిక్, అంబికా సోని, ఏకే ఆంటోనీ, మల్లికార్జున ఖర్గే, చిదంబరం, ప్రియాంక గాంధీ, ఆనంద్ శర్మ, సహా సిడబ్ల్యుసి సభ్యులు,కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు.

సిడబ్ల్యుసి సమావేశంలో పార్టీ అధ్యక్ష భాద్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సోనియాగాంధీ ప్రకటించినట్టు తెలుస్తోంది. అయితే ఆమెనే కొనసాగమని సభ్యులు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకత్వ మార్పు, పార్టీ కేంద్ర కార్యాలయ మార్పు, క్షేత్ర స్థాయి నుంచి ఏఐసీసీ వరకు పార్టీ ప్రక్షాళన తదితర అంశాల మీద చర్చించనున్నారు. అలానే సీనియర్ జూనియర్ల మధ్య సమన్వయం, కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు ఏర్పాటు, క్షేత్ర స్థాయి నుంచి ఏఐసీసీ వరకు కమిటీల నియామకం అంశాల మీద కూడా చర్లు జరగనున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: