దేశం సుభీక్షంగా ఉండాలని.. ప్రజల మేలు కోరే స్వామీజీల్లో ఒకరు త్రిదండి చినజీయర్ స్వామి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారత దేశంలోనూ ఆయనకు ఎంతో గొప్ప పేరు ఉంది. ఆయన భక్తి ప్రబోధలు ఎంతో మందిని ఉత్తేజ పరుస్తుంటాయి. తాజాగా త్రిదండి చినజీయర్ స్వామికి మాతృవియోగం కలిగింది. చినజీయర్ స్వామి తల్లి అలివేలుమంగ(85) కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
తన మాతృమూర్తి కన్నుమూశారని తెలిసిన వెంటనే ఆయన తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. తల్లి మరణాన్ని స్వామి తట్టుకోలేకపోతున్నారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు
శంషాబాద్ ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమం సమీపంలో అలివేలుమంగ అంత్యక్రియలు జరగనున్నాయి.