దేశ వ్యాప్తంగా కూడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అనేది ఇప్పుడు క్రమంగా పెరుగుతుంది. దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు డిజిటల్ చెల్లింపులు వేగంగా జరుగుతున్నాయి. యువత ఎక్కువగా వాడుతున్నారు. ఈ కరోనా సమయంలో కరెన్సీ ఎక్కువగా వాడకుండా వాటి మీదనే ఎక్కువగా ఆధారపడే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. తాజాగా దీనిపై నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రకటన చేసారు.

డిజిటల్ చెల్లింపుల వృద్ధి జరిగిందని అన్నారు.  యుపిఐ ఆగస్టు 2020 లో అత్యధిక లావాదేవీలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. 1,600 మిలియన్లకు పైగా లావాదేవీలు జరిగాయని అమితాబ్ కాంత్ ప్రకటనలో తెలిపారు. రూ. 3 లక్షల కోట్లు లావాదేవీలు జరిగాయని అన్నారు. కరోనా వలన అన్ని అంతరాయాలు ఉన్నప్పటికీ, మా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు సజావుగా పనిచేశాయని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: