ప్రేమించారు,
పెళ్లి చేసుకోవాలని భావించారు, పెద్దలను ఎదిరించాలని అనుకున్నారు,
పెళ్లి చేసుకోవడానికి అన్ని సిద్దం చేసుకున్నారు. హనుమంతుడి సాక్షిగా వివాహం చేసుకోవడానికి అన్ని సిద్దం చేసుకున్నారు. కాని అనుకున్నది ఒక్కటి జరిగింది మరొకటి.
యాదాద్రి, భువనగిరి
జిల్లా చౌటుప్పల్ లో కారు బీభత్సం సృష్టించిన ఘటనలో ప్రేమికులు ప్రాణాలు విడిచారు. బ్రేక్ ఫెయిల్ అయ్యి మూడు బైక్స్ ను ఢీకొట్టింది కారు.
బైక్ పై వెళ్తున్న హయత్
నగర్ కు చెందిన ప్రేమికులు
శ్రీలత, నాగరాజులను కారు ఢీ కొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
పెళ్లి చేసుకునేందుకు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం వద్దకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే యువతీ ప్రాణాలు కోల్పోయింది.
హైదరాబాద్ కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు(30) చెందాడు. ఇక ఈ ప్రమాదంలో స్కూటి
ఆయిల్ లీక్ అయి కాలిపోయింది.