బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ మరో సినిమా మొదలు పెట్టింది. ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న ఒక సినిమా ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ రోజు పూజా కార్యక్రమాలు జరగగా మా కార్యక్రమానికి నిర్మాతలు బెల్లంకొండ సురేష్, నరేందర్ హాజరై యూనిట్ ని ఆశీర్వదించారు. భానుశ్రీ లీడ్ రోల్ లో రామకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాని మేకా హేమ సుందర్ నిర్మిస్తున్నారు. 


సినిమా పేరు సర్వే నెంబర్ 3. ఈ సినిమాలో ఒక ప్రముఖ హీరో అతిథి పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కథ బాగా నచ్చడంతో కరోనా టైం అని కూడా చూడకుండా నిర్మిస్తున్నట్లు నిర్మాత  చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: