కడప జిల్లాకు చెందిన కీలక నేత  వివేకా హత్య కేసులో 101వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది, వివేకా హత్య కేసులో నిందితుడు ఉమా శంకర్ రెడ్డి కి నాలుగు రోజుల సీబీఐ కస్టడీకి పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చిన క్రమంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకూ ఉమా శంకర్ రెడ్డి ని విచారించారు. ఇక కస్టడీకి తీసుకోవడానికి ముందు ఉమా శంకర్ రెడ్డి కి వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించగా ఆ మేరకు వైద్య పరీక్షలు కూడా చేయించారు. వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పులివెందుల కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు అయింది, గతంలో 201 సెక్షన్ కింద అరెస్టు కాగా ఇప్పుడు బెయిల్ పై ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేసి కస్టడీకి ఇవ్వాలని కోర్టును సిబిఐ అధికారులు కోరగా ఆ మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: