ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయం లో తెలంగాణ ప్రజలకు బతుకమ్మను సంబరాలు జరుపుకోవడం ద్వారా ప్రజల్లో చెతన్యం పెంపొందింది . తద్వారా తెలంగాను సాధించారు కూడా .బతుకమ్మ తెలంగాణ సాంస్కృతిక చిహ్నం గా మారింది. ఇందులోభాగంగా తెలంగాణ సంస్కృతి ని దేశమంతటా , ప్రపంచమంతటా కూడా తెలిసేలా చేసే అవకాశం ఎంతైనా ఉంది. దీని పై తెలంగాణ జాగృతి ప్రెసిడెంట్ కల్వకుంట్ల కవితమీడియా ఛానల్ కి ఇఛ్చిన ఇంటర్వ్యూ లో ఆమె బతుకమ్మ పండుగ విధి విధానాలను తెలియ జేశారు. అక్టోబర్ నెల 23 వ తారీఖున దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా పై బతుకమ్మ సంబరాలను డిస్ప్లే చేయనున్నట్లు ఆమె తెలిపారు.



 తెలంగాణా యొక్క సాంస్కృతిక చిహ్నంగా బతుకమ్మను ప్రపంచ దేశాలకు తెలియజెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. అదేవిధంగా తాజాగా బతుకమ్మ పండుగ సందర్భంగా అల్లిపూల బతుకమ్మ అనే పాటను ఏ ఆర్ రెహమాన్ సంగీత సారధ్యం లో గౌతమ్ మీనన్ చిత్రీకరించారు. అయితే గౌతమ్ మీనన్ ఈ పాట ను తాను చిత్రీకరించిన తరువాత బతుకమ్మ పై ఓ చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నట్లు చెప్పడంతో కవిత అందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. బతుకమ్మను బుర్జ్ ఖలీఫా పై చూపించడం అనేది రెండు మూడు సంవత్సరాలుగా అనుకున్నప్పటికీ ఈ సంవత్సరం అది చేయబోతున్నట్లు ఆమె తన సంతోషాన్ని వెళ్లబుచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: