ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి విభ‌జిత ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డి ఏడేళ్లు పైబ‌డ‌టంతో ఆ రాష్ట్రానికి సంబంధించి ఇప్ప‌టికీ రాజ‌ధాని స‌మ‌స్య వెంటాడుతున్న‌ది. రాజ‌ధాని ఏదో తెలియ‌క రాష్ట్ర ప్ర‌జ‌లే కాదు, ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లు కూడా క‌న్‌ఫ్యూజ్ అవుతున్నాయి. తాజాగా రిజ‌ర్వ్ బ్యాంకు ఆప్ ఇండియా రాసిన లేఖ రాజ‌ధాని స‌మ‌స్య‌ను మ‌రొక‌సారి వెలుగులోకి తీసుకొచ్చిన‌ది. ఏపీ రాజధాని ఎక్క‌డో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించాక త‌మ కార్యాల‌యం ఏర్పాటు చేస్తామ‌ని రిజ‌ర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపిన‌ది.

రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్యాల‌యం ఏర్పాటు చేయాల‌ని అఖిల భార‌త పంచాయ‌తీ జాతీయ కార్య‌ద‌ర్శి వీరాంజ‌నేయులు ఆర్బీఐకి ఇటీవ‌ల లేఖ రాసారు. దీనిపై స్పందించిన ఆర్బీఐ డిప్యూటీ మేనేజ‌ర్ సుభా శ్రీ ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసారు. రాష్ట్ర ప్ర‌భుత్వం ఏపీ రాజ‌ధాని ఎక్క‌డో ఫైన‌లైజ్ చేస్తే అక్క‌డ ఆర్‌బీఐ సంస్థ‌ను నెల‌కొలుపుతాం అని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 104 క‌రెన్సీ చెస్ట్‌లు ప‌ని చేస్తున్నాయి. ప్ర‌తి 6 నెల‌ల‌కు ఒక‌సారి జ‌రిగే రాష్ట్రస్థాయి స‌మ‌న్వ‌య క‌మిటీ రాష్ట్రస్థాయి క‌మిటీ స‌మావేశాల సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రెన్సీ నోట్ల కొర‌త గుర్తించి ఎలాంటి ఫిర్యాదులు అంద‌లేద‌ని.. అధికార యంత్రాంగం, పోలీస్ వ్య‌వ‌స్థ‌తో స‌మ‌న్వ‌యంతో ఏపీలో స‌మ‌ర్థ‌వంతంగా క‌రెన్సీ నిర్వ‌హ‌ణ చేస్తున్నాం అని  సుభాశ్రీ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: