ప్రపంచంలోని అన్ని దేశాల్లో అందుబాటులో ఉన్న మెసేజింగ్ యాప్.. వాట్సాప్. యూజర్ ఫ్రెండ్లీగా.. ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ తప్పనిసరిగా మారింది. ఈ యాప్‌కు విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఆయా దేశాలు పలు రకాల నిబంధనలు విధిస్తూ ఉంటాయి. కొన్ని దేశాలు తమ దేశానికి సంబంధించిన యూజర్ల హిస్టరీని తమ కంట్రీ సర్వర్‌లోనే స్టోర్ చేయాలని నిబంధనలు పెడితే.. మరికొందరు తమ దేశాల యూజర్ల డేటాను భద్రత కల్పించాలని కండీషన్లు పెడుతుంటాయి.


అయితే తాజాగా సౌదీ అరేబియా కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంది. వాట్సాప్‌ వినియోగదారులకు ఒక నిబంధన విధించింది. వాట్సాప్‌లో ‘రెడ్‌ హార్ట్‌’ ఎమోజీని వాడితే ఏకంగా జరిమానా విధించేలా నిబంధనను తీసుకొచ్చింది. ఎదుటి వ్యక్తి అనుమతి లేకుండా రెడ్ హార్ట్‌ ను పంపిస్తే వేధింపులతో సమానంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సౌదీ అరేబియా దేశానికి చెందిన యాంటీ ఫ్రాడ్‌ అసోసియేషన్‌ సభ్యుడు అల్‌ మోతాజ్‌ కుత్బీ అధికారికంగా వెల్లడించాడు. 


ఇలా రెడ్‌ హార్ట్‌ ఉన్న ఎమోజీని పంపించిన వారికి 1 లక్ష సౌదీ రియల్స్‌ జరిమానా విధించడం జరుగుతుందన్నారు. మన దేశ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ. 20 లక్షలు. అయితే ఒకవేళ ఇదే నేరాన్ని ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ సార్లు చేస్తే ఏకంగా రూ. 60 లక్షల జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: