కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాంతార మూవీతో పాన్ ఇండియా గుర్తింపు సంపాదించటం తెలిసిందే. ఈ భారీ హిట్ సక్సెస్ తరువాత ఇప్పుడు కాంతార చాప్టర్ 1 ప్రీక్వెల్ రూపంలో థియేటర్స్‌లో సందడి చేస్తోంది. దసరా సందర్భంగా సినిమా రాబోవడంతో సినీ ప్రియులలో ఆసక్తి భాగా పెరిగింది. ఇప్పటికే కొన్ని ప్రీమియర్స్ , మొద‌టి షోలు పూర్తి చేసుకున్నాయి. ఈ ప్రీమియర్స్‌లోనుండి వచ్చిన పాజిటివ్ టాక్ సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది, రిషబ్ శెట్టి మరోసారి తన మ్యాజిక్ చూపించాడని నెటిజన్లు, ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. మేకర్స్ ప్రమోషన్స్ ను పెద్ద స్థాయిలో నిర్వహించకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ మొదట కొద్దిగా తక్కువగా ఉన్న‌యి ..

కానీ ప్రీమియర్స్ తర్వాత ఆడియన్స్ రియాక్షన్ అద్భుతంగా ఉంది. సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు, ఫ్యాన్స్ పోస్టులు పెరుగుతున్నాయి. కాంతార చాప్టర్ 1 మొత్తం ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం వచ్చిన టాక్ ప్రకారం సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే సూపర్ హిట్ అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ అయింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.252 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఇది రూ.300 కోట్ల క్లబ్ లోకి చేరేందుకు సిద్ధమవుతోంది. మొదటి మూడు రోజుల్లో మంచి బజ్ ఉన్నప్పటికీ, ఆ తర్వాత ప్రమోషన్స్ కొంత తగ్గడంతో బజ్ కూడా తగ్గింది. మేకర్స్ వెంటనే సక్సెస్ మీట్ & ప్రత్యేక ప్రమోషన్స్ ద్వారా బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

కాంతార vs ఓజీ – కలెక్షన్స్ యుద్ధం .. ఇంతలో, కాంతార చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ టాక్ తో రాబోవడం వలన ఓజీ సినిమా దసరా వీకెండ్ కలెక్షన్స్‌పై ఎఫెక్ట్ పడుతుందేమో అని అభిమానులు, పరిశీలకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టికెట్ రేట్లు తగ్గించడంతో ఓజీ కలెక్షన్స్ రాక్స్ అయినా, కాంతార చాప్టర్ 1 టాక్ వలన ఈ సీన్ ఇంకా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి, దసరా సీజన్ లో తెలుగు, కన్నడ సినిమాల మధ్య టక్రార్ మొదలైపోతున్నది. రిషబ్ శెట్టి మ్యాజిక్, పవన్ కళ్యాణ్ క్రేజ్.. ఈ రెండు బ్లాక్ బస్టర్స్ బిజినెస్ ఫోర్స్‌గా మార్కెట్‌ను ఆకర్షిస్తున్నాయి. కాంతార చాప్టర్ 1 & ఓజీ రేస్.. ఈ వారం తెలుగు సినిమా ప్రేక్షకులందరి హాట్ టాపిక్!

మరింత సమాచారం తెలుసుకోండి: