సినీ నటుడు మంచు విష్ణు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన ఈసారి తన సొంత హెయిర్ స్టయిలిస్ట్ పైనే కేసు పెట్టారు. ఈ మేరకు మంచు విష్ణు పర్సనల్ హెయిర్‌ స్టయిలిస్ట్‌పై జూబ్లీ హిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. మంచు విష్ణు వద్ద నాగ శ్రీను హెయిర్ స్టయిలిస్ట్ గా పని చేస్తున్నారు. ఈ నాగ శ్రీను బోరబండకు చెందిన వాడు. నాగ శ్రీను ఈ నెల 17న విష్ణుకు చెందిన హెయిర్‌ డ్రెస్సింగ్‌, మేకప్‌ సామగ్రిని చెప్పా పెట్టకుండా తీసుకెళ్లిపోయాడట. ఈ సామాగ్రి విలువ 5లక్షల రూపాయల వరకూ ఉంటుందట. జూబ్లీహిల్స్‌ సీబీఐ కాలనీలోని కార్యాలయంలోని మంచు విష్ణు కార్యాలయంలో ఈ  చోరీ జరిగిందట.

ఈ సామగ్రి గురించి నాగ శ్రీనును కనుక్కుందామని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదట. దీంతో నాగ శ్రీను చోరీకి పాల్పడినట్లు మంచు విష్ణు లీగల్‌ మేనేజర్‌ సంజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న  జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారట. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: