రాజ్యసభలో ఆమ్‌ ఆద్మీ పార్టీ బలం పెరిగింది. ఏకంగా ఒకేసారి ఆరుగురు ఎంపీలు ఆ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ తరఫున పంజాబ్‌ నుంచి రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేసిన ఐదుగురు అభ్యర్థులు గెలుపొందినట్లు రాజ్యసభ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ స్థానాలకు మిగిలిన పార్టీల అభ్యర్థులు ఎవరూ నామినేషన్‌ వేయలేదు. అందుకే వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాజ్యసభ కార్యదర్శివెల్లడించారు.

నామినేషన్‌ ఉపసంహరణకు ఇవాళ్టితో గడువు ముగిసింది. బరిలో ఆప్‌కు చెందిన ఐదుగురు మాత్రమే ఉన్నారు. దాంతో వారి ఎంపిక పూర్తయింది. ఈ ఐదుగురు ఎవరో తెలుసా..మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, లవ్‌లీ ప్రొఫెషనల్ వర్సిటీ ఉపకులపతి అశోక్ మిత్తల్‌, దిల్లీకి చెందిన ఆప్‌ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, ఐఐటీ దిల్లీ ప్రొఫెసర్‌ సందీప్ పాఠక్‌, వ్యాపారవేత్త సంజీవ్ అరోరా. వీరినే ఆప్‌ పంజాబ్‌ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

aap