అవును చైనా ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటోంది. కరోనా బారి నుంచి కాస్త కోలుకుంటోంది. ఆ దేశంలోని పెద్ద నగరాల్లో ఒకటైన షాంఘైలో దాదాపు 2నెలల తర్వాత లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించారు. అదీ పాక్షికంగానే సుమా.. కానీ రెండు నెలలుగా ఊపిరి బిగపట్టుకున్న షాంఘై వాసులు.. దీంతో వీధుల్లో సంచారం ప్రారంభించారు. అలాగే బస్సు సర్వీసులు, సబ్‌వేలలో రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి.


పరిమితంగా కొన్ని రైలు సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. పాఠశాలలను కూడా పాక్షికంగానే తెరిచారు. మాల్స్‌, సూపర్‌ మార్కెట్లు, ఇతర దుకాణాలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే 75శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే పనిచేసేందుకు అనుమతి ఉంది. ఇక సినిమా థియేటర్లు, జిమ్‌లు, పార్కులు మాత్రం ఇంకా తెరుచుకోలేదు సుమా.  షాంఘై, బీజింగ్‌సహా ఇతర నగరాల్లోని పబ్లిక్‌ ప్లేస్‌ల్లోకి ప్రవేశించాలంటే మాత్రం 48గంటల ముందు తీసుకున్న కరోనా నెగెటివ్‌ సర్టిఫికెట్ మాత్రం కావాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: