తిరుమలలో శ్రీవారి అంగ ప్రదక్షిణ సేవకు డిమాండ్ ఉంటుంది. ఈ సేవకు టికెట్లు ఆఫ్‌ లైన్‌లోనే ఇస్తుంటారు. అయితే.. ఇటీవల ఈ టికెట్లు కూడా ఆన్‌ లైన్‌లోనే ఇవ్వాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఆ నిర్ణయాన్ని తిరుమల, తిరుపతి స్థానికులు తప్పుబడుతున్నారు. అంగప్రదక్షణ సేవ విషయంలో టీటీడీ తీసుకొచ్చిన ఆన్ లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తిరుమల తిరుపతి అంగ ప్రదక్షణ భక్త బృందం  నిరసన చేపట్టింది.


తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదుట వీరు ధర్నా చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం తీరును నిరసిస్తూ పరిపాలనా భవనం వద్ద వీరు అంగ ప్రదక్షణ చేశారు. ఆన్ లైన్ విధానాన్ని రద్దు చేసి ఆఫ్ లైన్ లో అంగప్రదక్షణ సేవను జారీ చేయాలని వినతి పత్రం అందజేశారు. తిరుమల, తిరుపతి స్థానికులకు అంగప్రదక్షణ సేవను దూరం చేయవద్దని కోరారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా తితిదే నిర్ణయాలు తీసుకోవాలని.. స్థానిక భక్తులకు ప్రాధాన్యత నివ్వాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: