ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు పూర్తి అయ్యాయి. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈమధ్యనే 10 వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఆ ఫలితాల్లో పాస్ శాతం చాలా తక్కువ నమోదు కావడం వల్ల ఇంటర్ విద్యార్థులు కూడా తమ ఫలితాల పట్ల ఆందోళనగా వున్నారు.ఈరోజు రేపు ఫలితాలు విడుదల అంటూ రోజుకో పుకారు వినిపిస్తుంది. వాటికిప్పుడు తెర పడింది.ఇక విద్యార్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఏపీ ఇంటర్ ఫలితాలు అనేవి విడుదల కానున్నాయి.
బుధవారం నాడు రిజల్ట్స్ విడుదల చేయనున్నట్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాడు 12.30 గంటలకు
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.
విజయవాడ ఫార్ట్యూన్
మురళి లో 12:30 కు
ఈ ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్లో
చెక్ చేసుకోవచ్చు.