జమ్మూకాశ్మీర్‌ పై అమిత్‌ షా ప్రత్యేక వ్యూహం రచిస్తున్నారు. మొదటి నుంచి జమ్మూకాశ్మీర్‌ ను ఇండియాలో పూర్తి భాగంగా మార్చేందుకు పట్టుదలగా ఉన్న అమిత్‌ షా.. ఆ ప్రాంతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతున్నారు. జమ్మూకాశ్మీర్‌లో ఇటీవల భద్రతా సిబ్బందిపై దాడులు ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు, హత్యల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అక్కడి భద్రతపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.


జమ్మూకాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులు పాకిస్థాన్‌తో సరిహద్దు వెంబడి భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్, జమ్మూకాశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు బాగా పెరిగాయి. నాలుగు రోజుల్లో ఉగ్రవాదులు మూడు సార్లు చొరబాటుకు యత్నించారు. ఉరీలో ముగ్గురు ఉగ్రవాదులను సైనికులు చంపేశారు.  పల్లన్‌వాలా సెక్టార్‌లోని భారత భూభాగంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు యత్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: