ది జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నాన్ అలాటీ  స్టీరింగ్ కమిటీ సభ్యులు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను కలిశారు. ఇప్పటి వరకు ఇండ్ల స్థలాలు పొందని హౌసింగ్ సొసైటీ సభ్యులందరికీ ఇండ్ల స్థలాలు వచ్చేలా చూడాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు. అల్లం నారాయణ మాట్లాడుతూ అర్హులైన జెసిహెచ్ఎస్ సభ్యులందరికీ ఇండ్ల స్థలాలు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.


తాజాగా సుప్రీంకోర్టు తీర్పు తో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలకు క్లియరెన్స్ వచ్చిందని అల్లం నారాయణ చెప్పారు. జర్నలిస్టులను ప్రత్యేక కేటగిరీగా సుప్రీం కోర్టు పేర్కొనడం సంతోషదాయకమైన విషయమని అల్లం నారాయణ అన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల విషయం  ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తెచ్చి అర్హులైన జర్నలిస్టు లందరికీ న్యాయం జరిగేలా చూస్తామని అల్లం నారాయణ  పేర్కొన్నారు. అర్హులైన జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా ముఖ్యమంత్రి చూస్తారని, జర్నలిస్టు మిత్రులందరూ ఆయనపై నమ్మకం ఉంచాలని అల్లం నారాయణ  కోరారు. ఈ కార్యక్రమంలో JCHSL నాన్ అలాటీ స్టీరింగ్ కమిటీ సభ్యులు బి.గోపరాజు, భీమగాని మహేశ్వర్ గౌడ్, ఎన్.సుందర్, ఎం.రవీంద్రబాబు, జె.రామకృష్ణ, సత్యమూర్తి, ఎన్.భూపాల్ రెడ్డి, పర్వీన్, వై.సునిత పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: