దిల్లీలో ప్రభుత్వానికి అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్‌కు మధ్య అప్రకటిత వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ కేజ్రీవాల్ సర్కారుపై ఇప్పటికే మద్యం విధానంపై ఆరోపణలు వచ్చాయి. వాటితోనే కేజ్రీవాల్ సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇక ఇప్పుడు మరో అంశంలో అవినీతి ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి.  దిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసిన లోఫ్లోర్‌ బస్సుల వ్యవహారంలో అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.


అంతే కాదు.. ఈ ఆరోపణల వచ్చిన ఫిర్యాదును లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జీ) వి.కె.సక్సేనా  సీబీఐకి పంపేందుకు నిర్ణయించారట. అసలేమైందంటే..  జులై 2019లో దిల్లీ ప్రభుత్వం 1,000 లోఫ్లోర్‌ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచింది. వార్షిక నిర్వహణకు సంబంధించిన ఒప్పందం కోసం మార్చి 2020లో మరోసారి టెండర్లు పిలిచింది. ఈ టెండర్ల ఖరారులో అవకతవకలు జరిగాయంటూ ఎల్‌జీకి ఫిర్యాదు వచ్చింది. బస్సుల కొనుగోలు ప్రక్రియ కమిటీ ఛైర్మన్‌గా దిల్లీ రవాణాశాఖ మంత్రిని నియమించడం ఆ ఆరోపణలు ఊతమిస్తోంది. ఇప్పటికే దిల్లీ సర్కారుపై గుర్రుగా ఉన్న ఎల్‌ జీ ఈ ఛాన్స్ వదలుకుంటారా.. మరి ఈ కొత్త ఆరోపణలు ఏ రేంజ్‌కు వెళ్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

aap