ఏపీ విభజన తర్వాత ఏపీలో కలిపేసిన విలీన మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలన్న డిమాండ్‌ తెలంగాణ అసెంబ్లీలో వినిపిస్తోంది. విలీన మండలాల్లోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య డిమాండ్ చేసారు. 5 గ్రామాలను కలిపేందుకు కేసీఆర్ చొరవ చూపాల్న పొడెం వీరయ్య.. పోలవరం ముంపుపై అధ్యయనం చేయించాలన్నారు. మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ భద్రాచలం రాముడికే ముంపు ప్రమాదం వచ్చిందన్నారు. 5 గ్రామాలను కేంద్రం వెంటనే తెలంగాణలో కలపాల్న సండ్ర వెంకట వీరయ్య..
కేంద్రం పెద్దన్నగా చొరవ తీసుకుని ఏపీతో మాట్లాడాలని కోరారు.

ఈ అంశంపై స్పందించిన హరీశ్‌రావు.. పోలవరం ముంపు సమస్యను కేసీఆర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ముంపుపై పూర్తిస్థాయి అధ్యయనం జరగాలని కోరుతున్నామని.. సుప్రీంకోర్టులో కేసు వేశాం.. కొట్లాడుతున్నామని హరీశ్‌రావు తెలిపారు. భద్రాద్రి రాముడిని, ప్రజలను కాపాడేందుకు ప్రయత్నిస్తామని.. హరీశ్‌ రావు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap