టిడ్కో ఇళ్లు.. పేదల కోసం ప్రభుత్వం ఇస్తున్న ఇల్లు ఇవి. చాలా చోట్ల ఈ నిర్మాణాలు పూర్తయినా పంపకాలు మాత్రం కాలేదు. వాటి కోసం జనం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అధికారులు, పాలకులు ఇంకా కరుణించడం లేదు. అయితే.. గుంటూరు జిల్లా మంగళగిరిలో మాత్రం ఈ నెల రెండో వారంలో టిడ్కో ఇళ్లు ఇస్తామని కలెక్టర్ చెబుతున్నారు. మంగళగిరిలో టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలపై కలెక్టర్ వేణుగోపాలరెడ్డి అధికారులతో సమీక్షించారు.


టిడ్కో ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాల పనులను కలెక్టర్, స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావులు పరిశీలించారు. విద్యుత్, రోడ్ల నిర్మాణం, తాగు, మురుగునీటి పనులను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వేగంగా సాగుతున్నాయని సమీక్ష అనంతరం కలెక్టర్ చెప్పారు. మంగళగిరిలో కురుస్తున్న వర్షాల వల్ల తాగునీటి ట్యాంక్ నిర్మాణంలో ఆలస్యం జరుగుతోందన్నారు. వర్షాలు కురవకపోతే అక్టోబరు 2నుంచి దశల వారీగా గృహప్రవేశాలు నిర్వహించే వాళ్లమన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈనెల రెండో వారంలో గృహప్రవేశాలు జరుగుతాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: