టీటీడీ తన మ‌హిళా ఉద్యోగుల‌కు క్యాన్సర్ పై మూడు రోజుల పాటు అవగాహన కల్పిస్తోంది. ప్రశాంత‌మైన మ‌న‌స్సుతో యోగా, ధ్యానం అల‌వ‌ర‌చుకుని గో ఆధారిత వ్యవ‌సాయ ఉత్పత్తుల‌ను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ ర‌హిత స‌మాజాన్ని నిర్మించ‌వ‌చ్చని టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి తెలిపారు. టీటీడీ మ‌హిళా ఉద్యోగుల‌కు క్యాన్సర్ పై మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న అవ‌గాహ‌న కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీనటి  గౌత‌మి కూడా హాజరయ్యారు.


మ‌హిళ‌ల‌కు క్యాన్సర్ ప‌ట్ల అవ‌గాహ‌న ముఖ్యమ‌ని ఈఓ తెలిపారు. క్యాన్సర్ ను తొలి ద‌శ‌లోనే గుర్తిస్తే పూర్తిగా నివారించ‌వ‌చ్చని నటి గౌతమి తెలిపారు. మాంసాహార భోజ‌నం, పాశ్చాత్య ఆహార అల‌వాట్లు క్యాన్సర్‌కు కార‌ణ‌మ‌ని నటి గౌతమి అన్నారు. గోవును ర‌క్షించి గో ఆధారిత వ్యవ‌సాయ ఉత్పత్తుల‌ను తింటే వంద శాతం క్యాన్సర్ రాకుండా చూడ‌వ‌చ్చని నటి గౌతమి అన్నారు. స‌మాజంలోని ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ ప‌ట్ల అవ‌గాహ‌న ముఖ్యమ‌ని నటి గౌత‌మి తెలిపారు. వ‌య‌సుతో నిమిత్తం లేకుండా ఎవ‌రికైనా క్యాన్సర్ రావ‌చ్చన్న నటి గౌతమి... స‌రైన ఆహార అల‌వాట్లు, ర‌సాయ‌న ర‌హిత ఉత్పత్తుల వినియోగం వ‌ల్ల దీనికి అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: