పోలవరం ప్రాజెక్టు అథారిటీ-PPA సమావేశం హైదరాబాద్‌లో జరగనుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంజనీర్లు పాల్గొంటున్నారు. హైదరాబాద్‌లో ఉన్న పీపీఏ కార్యాలయాన్ని రాజమహేంద్రవరం తరలించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది. అలాగే పొలవరం బ్యాక్ వాటర్స్ కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపు ఏర్పడుతోందని తెలంగాణ వాదిస్తోంది. ఈ బ్యాక్ వాటర్స్  ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేయాలని తెలంగాణ కోరుతోంది.


గోదావరి ముంపు సమస్యలపై నిపుణుల కమిటీ ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చింది. మొత్తం 827ఎకరాల వరకు ముంపునకు గురవుతోందని తెలంగాణ వాదిస్తోంది. ఆ మేరకు పీపీఏ ద్వారా భూసేకరణ చేయాలని తెలంగాణ సూచించింది. ఇటీవల రెండు రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉమ్మడి సర్వే కూడా నిర్వహించారు. మరి ఈ భేటీలో ఎవరి వాదన ఎలా సాగుతుందో.. చివరకు అధారిటీ ఏం చెబుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: