తిరుమలలో శ్రీవారి లడ్డూల విషయంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. లడ్డూ విక్రయాశాలను నిర్వహిస్తున్న కేవిఎం సంస్థ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వివరించారు. కేవీఎం సంస్థ మరియు సిబ్బంది లడ్డూ విక్రయశాలలో భారీ అవకతవకలను పాల్పడ్డారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.


వీరు ఒక దశలో టీటీడీను కూడా బ్లాక్ మెయిల్ చేయాలనుకున్నారన్నారని టీటీడీ  ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అందుకే కేవిఎమ్ సంస్థ కాంట్రాక్ట్ ను రద్దు చేశామని..  అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని నిర్ణయించామని టీటీడీ  ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఉద్యోగులు, కార్పోరేషన్ సిబ్బంది, శ్రీవారి సేవకులతో లడ్డూ కౌంటర్లు నిర్వహిస్తున్నామని టీటీడీ  ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వీరికి 17,500 జీతం, వసతి సదుపాయం కల్పిస్తూ కొత్త సిబ్బందిని కార్పోరేషన్ ద్వారా నియమించుకోవాలని నిర్ణయించామని టీటీడీ  ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: