
రూ. 1,028 కోట్లతో హైదరాబాద్ సమీపంలోని బీబీ నగర్ లో ఎయిమ్స్ ఏర్పాటు చేశామని.. రూ. 1,032 కోట్లతో సనత్ నగర్ లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో కొత్త ఓపీడి బ్లాక్ నిర్మాణం మరియు అధునాతన వైద్య సదుపాయాల కల్పించామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. రూ. 240 కోట్లతో ఆదిలాబాద్, వరంగల్ లోని ప్రభుత్వ ఆసుపత్రులలో నూతన బ్లాకుల నిర్మాణం, అధునాతన వైద్య సదుపాయాలను కల్పన చేశామని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అంటున్నారు. రూ. 902 కోట్లతో ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,549 హెల్త్ & వెల్ నెస్ సెంటర్ల (బస్తీ దవాఖానాల) ఏర్పాటు, రూ. 30 కోట్ల నిధులతో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సదరన్ రీజియన్ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు, పీఎం కేర్స్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 50 ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు, స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా రూ. 3,744 కోట్ల వ్యయంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31.2 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం.. ఇవన్నీ మా ఘనతే అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.