గుడివాడ క్యాసినో కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ విషయంలో టీడీపీ నేత వర్ల రామయ్యకు ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయి. సంక్రాంతి సందర్భంగా గుడివాడలోని కొడాని నాని కే కన్వెన్షన్ లో జూదం ఆడారని కేసు నమోదైంది. అయితే అప్పట్లో టీడీపీ నేతలు ఆ క్యాసినో వీడియోలను మీడియాకు విడుదల చేశారు. ఆ మధ్య వర్ల రామయ్య దీనిపై కంప్లైంట్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటికీ ఫిర్యాదు చేశారు. దాదాపు 500 కోట్ల లావాదేవీలు జరిగాయని.. దీనిపై పోరాడుతామని మండిపడ్డారు. ఇప్పుడు ఐటీ శాఖ నుంచి రిప్లై వచ్చింది.


వర్ల రామయ్య దగ్గరున్న సాక్ష్యాధారాలు సమర్పించాలని తెలిపారు ఐటీ అధికారులు. ఈనెల 19న విజయవాడలో సాక్ష్యాలు సమర్పించాలని సూచించారు. మరోవైపు ఇన్ని రోజులకు ఐటీ శాఖ స్పందించడం ఇంట్రెస్టంగ్ గా మారింది. ఇటీవలే హైదరాబాద్ లో క్యాసినోలు నిర్వహించే చికోటి ప్రవీణ్ నివాసాల్లో ఈడీ దాడులు జరిగాయి. ఆ కేసులో భాగంగానే గుడివాడ క్యాసినో కేసును సీరియస్ గా తీసుకుంటున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: