పల్నాడు ప్రాంతంలో 2019 నుంచి జరుగుతున్న హింస, హత్యా రాజకీయాలపై ఏపీ డీజీపీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 2019 ఎన్నికల తరువాత టీడీపీ మద్దతు దారులపై జరిగిన దాడుల నుంచి తాజా మాచర్ల హింస వరకు వైకాపా అరాచకాలు, పోలీసులు వైఫల్యం, భాగస్వామ్యం వివరిస్తూ 7 పేజీల లేఖను ఆయన డీజీపికి రాశారు. 2020లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం నేతలపై జరిగిన దాడి, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకున్న ఘటనలను చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.


పల్నాడు ప్రాంతంలో గత మూడున్నరేళ్లలో జరిగిన 16 రాజకీయ హత్యలు, పోలీసుల వైఫల్యం, లా అండ్ ఆర్డర్ సమస్యలను చంద్రబాబు ప్రశ్నించారు. ఈ నెల 16తేదీ నాటి మాచర్ల హంసలో పోలీసుల వైఫల్యం, వారి భాగస్వామ్యంపై లేఖలో చంద్రబాబు ప్రస్తావించారు. నిందితులతో పాటు సహకరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: