బలహీన వర్గాలకు సంక్షేమాన్ని అందించడమే ప్రజారోగ్యం ముఖ్య ఉద్దేశ్యమని ఏపీ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. దీనికి ప్రభుత్వాలు మరింత ప్రాధాన్యమివ్వాలని గవర్నర్‌ సూచించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ప్రజారోగ్య రంగంలో మన దేశం సవాళ్లను ఎదుర్కొంటుందని గవర్నర్ అన్నారు. పేదరికం వల్ల ఒక దశాబ్దం నుంచి దేశ ఆర్థిక వృద్ధి గణనీయంగా తగ్గిందని గవర్నర్ తెలిపారు.


దేశం శక్తివంతమైన ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ పరిశ్రమలతో పాటు ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నా  పిల్లల పోషకాహార లోపం, తక్కువ జనన బరువుల పరంగా సవాలును ఎదుర్కొంటోందని గవర్నర్ వివరించారు. ఇది అకాల మరణాలు, జీవితకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తున్నాయన్నారు.  ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో ధనవంతులు, పేదల మధ్య, పట్టణ, గ్రామీణ ప్రాంత వాసుల మధ్య అసమానతలు కొనసాగుతున్నాయని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ యోజన పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందజేస్తుందని గవర్నర్ తెలిపారు. కార్పొరేట్ సంస్ధలు సామాజిక బాధ్యతగా వ్యాధుల నివారణ కార్యకలాపాలలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని గవర్నర్ బిశ్వభూషణ్‌ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: