దేశంలోనే వ్యక్తిగత విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ సర్ ప్లస్ లో ఉందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. దేశంలోనే వ్యక్తిగత విద్యుత్ వినియోగంలో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉందని ఆయన వివరించారు. రాష్ట్రంలో డ్రాపవుట్లు లేనే లేరని స్పష్టం చేశారు. అర్థిక అర్థ గణాంక కార్యాలయంలో గణాంక నివేదికను ఆర్థిక సలహాదారు జీ.ఆర్ రెడ్డితో కలిసి విడుదల చేశారు.


తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రరతలు అద్బుతంగా ఉన్నాయని, అందుకే పెట్టుబడిదారులకు ఎటువండి ఢోకా లేదని వినోద్ కుమార్ అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యవసాయ కూలీలు తెలంగాణ రాష్ట్రానికి తరలివస్తున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రం వైద్య,విద్యలో అద్బుత పురోగతి సాధించిందన్నారు. దావోస్ లో 21,0000వేల పెట్టుబడి పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకొచ్చారని వినోద్ కుమార్ పేర్కొన్నారు. మౌళిక సదుపాయాలు కల్పనలో రాష్ట్రం బాగుందని వినోద్ కుమార్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: