పోలీసు ఉద్యోగాల కోసం నిర్వహించిన  దేహదారుడ్య పరీక్షల్లో 1సెం.మీ తక్కువ ఎత్తుతో అనర్హత పొందిన వాళ్లకు పోలీస్ నియామక మండలి ఇప్పుడు మరో అవకాశాన్ని కల్పించింది. హైకోర్టు ఆదేశాలతో ఆయా అభ్యర్థులకు తిరిగి మరోసారి ఎత్తును కొలవాలని అధికారులు నిర్ణయించి.. హైదరాబాద్ లోని అంబర్ సీపీఎల్ మైదానం, కొండాపూర్ లోని 8వ పోలీస్ బెటాలియన్ మైదానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల వరకు పోలీస్ నియామక మండలి వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని.. ఆ పత్రాలను డౌన్ లోడ్ చేసుకొవాలని సూచించారు.


తిరిగి ఎత్తు కొలిచే ప్రక్రియలో అభ్యర్థులు దరఖాస్తు పత్రాలను తీసుకురావాలని అధికారులు సూచించారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోలీస్ నియామక మండలి దేహదారుడ్య పరీక్షలు నిర్వహించగా ఈ క్రమంలో నిర్దేశించిన ఎత్తుకంటే 1 సెం.మీ తక్కువ ఎత్తు ఉన్న వాళ్లను అనర్హులుగా ప్రకటించారు. ఆ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. సదరు అభ్యర్థుల ఎత్తును మరోసారి కొలవాలని హైకోర్టు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: