ఈనెల 17న సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న సభకు భారీ జనసమీకరణ చేయాలని మంత్రి కేటీ రామారావు నేతలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం పదివేల మంది హాజరయ్యేలా చూడాలని.. ఈనెల 13న గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలని.. ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇంచార్జిలుగా నియమించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.


ఈనెల 13 నుంచి  17 వరకు ఇంచార్జిలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోని ఉండి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని..  దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్ గ్రౌండ్ సభను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: